కార్తీక మంగళవారం సందర్భంగా ములుగు రోడ్ జంక్షన్ పెద్దమ్మ గడ్డ హన్మకొండ లో ఇటీవల సెల్లార్ నిర్మాణం కోసం తవ్వినటువంటి కందకాల్లో బయటపడ్డ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిపెద్దమ్మ ఆలయ నిర్మాణ కమిటీ మార్క సునీల్ కుమార్ గౌడ్, సుధన్ ఆధ్వర్యంలో ఆచార్యులు వంగల శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించారు.