మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని వరంగల్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు, జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ సమక్షంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల ప్రకారం మంగళవారం హనుమకొండ జిల్లా ఖాజిపేట మండలం అమ్మవారి పేట గ్రామ శివారులోని మెడ్ క్లిన్ సర్వీసెస్ లో కాల్చారు. ఎక్సయిజ్ సీఐలు, ఎస్ఐలు, తదితరులున్నారు