ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఆదివారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖడేతో కలసి వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇరిగేషన్, బల్దియా శానిటేషన్, ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.