హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి పరిధిలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.