ఐనవోలు మండల కేంద్రం లోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రారంభం అవుతున్నాయి. నేడు స్వామి వారికి నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నిరాజన మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ గావిస్తున్నారు.