ఎనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు

568చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేడు బుధవారం మార్కెట్లో మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 17200, 341 రకం మిర్చి 13300, వండర్ హాట్ మిర్చి రకం 15500, 5531 రకం మిర్చి 12000 పలికిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతుల తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటించి తమ సరుకును మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్