నిమజ్జనోత్సవంలో డీజేలు నిషేధం

53చూసినవారు
నిమజ్జనోత్సవంలో డీజేలు నిషేధం
వినాయక నిమజ్జనోత్సవంలో డీజేలను నిషేధించినట్లు హసన్ పర్తి సీఐ చేరాలు శనివారం తెలిపారు. ఈ నెల 16వ తేదీన జరిగే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఇందుకు వినాయకమండలి నిర్వాహకులు సహకరించాలని తెలిపారు. మండల పరిధిలోని పలువురు డీజే ఓనర్లను, ఆపరేటర్లను తహసీల్దారు ఎదుట బైండోవర్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్