అయినవోలు దేవస్థానం చైర్మన్ కమిటీ పదవి యాదవుల కేటాయించాలి

347చూసినవారు
అయినవోలు దేవస్థానం చైర్మన్ కమిటీ పదవి యాదవుల కేటాయించాలి
వరంగల్ అర్బన్ జిల్లాలోని అయినవోలు మండలం కేంద్రంలో నెలకొన్న మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పదవిని యాదవుల కేటాయించాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు మట్ట కుమారస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, అంతకు రెట్టింపు స్థాయిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యాదవ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, యాదవుల కులదైవమైన మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ ను శాశ్వతంగా యాదవులకు ఇచ్చే విధంగా చొరవ చూపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల యాదవులను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్