పర్వతగిరిలో విద్యార్ధినిలకు కరాటే శిక్షణ

358చూసినవారు
పర్వతగిరిలో విద్యార్ధినిలకు కరాటే శిక్షణ
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని విజ్ డమ్ పాఠశాలలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి సోమవారం పాఠశాలలోని విద్యార్ధినిలకు, ఉపాధ్యాయునులకు కరాటేలో మెలకువలను కరాటే ఉపాధ్యాయుడు కుమారస్వామి నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దేవేందర్ మాట్లాడుతూ బాలికలు, మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అన్నారు. మహిళలకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్