యువజన దినోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి

548చూసినవారు
యువజన దినోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్రంలోని విస్డమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రామకృష్ణ సేవా సమితి, విస్డమ్ పాఠశాల సంయుక్తంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఆయన జీవితం యువతకు ఆదర్శ ప్రాయమని, వివేకానందుని అడుగుజాడల్లో యువత నడుస్తూ దేశభక్తి కలిగి ఉండి దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ మేంబర్ ఘటిక అజయ్ కుమార్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ నాయకులు వివిధ యువజన సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, సేవా సమితి పర్వతగిరి సభ్యులు, రామకృష్ణ సేవా సమితి హనుమకొండ ప్రతినిధి వెంకటేశ్వర్లు గారు, విస్డమ్ పాఠశాల ప్రతినిధులు దేవేందర్, సుధాకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్