ప్రభుత్వాసుపత్రిలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి. కాలం చెల్లిన మందులు వేసుకొని ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జరిగింది. రాయపర్తి పట్టణ కేంద్రానికి చెందిన అశోక్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు కాలం చెల్లిన మందులను ఇచ్చారు. అవి వేసుకున్న బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురికావడం జరిగింది.