వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఐనవోలు, ఒంటిమామిడిపల్లి గ్రామాల పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు.