వరంగల్ అర్బన్ జిల్లా గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ మడికొండ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు దువ్వ నవీన్ తల్లి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జోరిక రమేష్, 53వ డివిజన్ ప్రెసిడెంట్ పోలపల్లి రామ్మూర్తి, బైరి కొమురయ్య, స్థానిక డివిజన్ నాయకుల, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.