పర్వతగిరి శివారు దేవి లాల్ తండాకు చెందిన చికెన్ సెంటర్ దేవేందర్ కుమార్తె నిర్మల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా పర్వతగిరి జడ్.పి.హెచ్.ఎస్ లోని 1999-2000 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో దేవేందర్ కు శనివారం రూ.10,000 రూపాయలు సహకారంగా అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాడుగుల రాజు, ఎర్రబెల్లి హరికుమార్, ముంజ శ్రావణ్ గౌడ్, కత్తి భాస్కర్, కుమార్, వీరన్న, శ్రావణ్, తిరుమలేష్ లు పాల్గొన్నారు.