లడాఖ్‌లో వాతావరణం వేడెక్కి మంచు పర్వతాలు వేగంగా కరుగుతున్నాయి. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరమైన అంశమని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు. గ్లేసియర్స్ నుంచే మనకు నీళ్లు వస్తాయని, ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతుంటే, అప్పుడు గ్లేసియర్స్ వేగంగా కరుగుతుంటాయన్నారు. లడాఖ్‌లో 30 డిగ్రీలు అంటే.. మెట్ట ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లే అని, అంత వేడి ఉంటే, అప్పుడు పర్వతాలపై ఉన్న ఐస్ వేగంగా కరిగిపోతుందని తెలిపారు.