కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ప్రమాదంలో చిక్కుకోకుండా ఓ చిలుక కొందరిని కాపాడింది. ప్రమాదానికి ముందురోజు వినోద్ అనే వ్యక్తి తన చిలుక (కింగిని)తో సోదరి ఇంటికి వచ్చారు. అయితే ఒక్కసారిగా అది బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని నోటితో పొడుస్తూ ప్రకృతి విలయ విపత్తుపై హెచ్చరించింది. వెంటనే వినోద్ తేరుకొని పొరుగువారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. మూగజీవులకు విపత్తులను పసిగట్టే గుణం ఉంటుంది.