వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు

80చూసినవారు
వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 289కి చేరుకుంది. శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులను చూపిస్తోంది.

సంబంధిత పోస్ట్