తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలుచేస్తామని భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేసింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపీ మరో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది. భీమ్‌రావ్ అంబేడ్కర్ స్టైపండ్ పథకం కింద షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపింది.