తెలంగాణకు పూర్తిగా బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) తీసుకున్న నిర్ణయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. 'బీర్ల రేట్లు పెంచమని యునైటెడ్ బ్రూవరీస్ కోరింది. కంపెనీ అడిగినట్టు రేట్లు పెంచితే, రాష్ట్రంలోని వినియోగదారులపై భారం పడుతుంది. 33% రేట్లు పెంచాలని కంపెనీ కోరుతోంది. ధరల పెంపుపై కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటాం' అని స్పష్టం చేశారు.