లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చారన్నారు. ఢిల్లీలో కరెంటు బిల్లులు జీరోకు తీసుకొచ్చామని, ఇక్కడ కూడా జీరో బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని గుర్తు చేశారు.