'ధరణి'ని బంగాళాఖాతంలో కలిపాం: పొంగులేటి

53చూసినవారు
'ధరణి'ని బంగాళాఖాతంలో కలిపాం: పొంగులేటి
పేదోడికి చెందాల్సిన ఆస్తులను పేదోడికే అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపామన్నారు. లోపభూయిష్టమైన ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేశామని చెప్పారు. భూభారతి చట్టం వల్ల ప్రజలు, పేదలు, రైతులకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. లోపాలతో ఉన్న ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్