ఉల్లి రైతుల అసంతృప్తితో లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయాం

55చూసినవారు
ఉల్లి రైతుల అసంతృప్తితో లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయాం
ఉల్లి రైతుల్లో నెలకొన్న అసంతృప్తి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికార ఎన్డీయేను దెబ్బతీసిందని ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్ అన్నారు. ఉల్లి ధరలకు సంబంధించిన అంశాలు ఎన్నికలను ఎలా ప్రభావితం చేశాయనే దానిపై ఇటీవల ఢిల్లీలో ఉన్నప్పుడు పీయూష్ గోయల్, అమిత్ షా సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిపారు. ఎట్టకేలకు తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు భావిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you