TG: వరంగల్‌కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన తరువాత ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌లో భద్రకాళి ట్యాంకు, టెక్స్‌టైల్ పార్కులో అభివృద్ది పనులు చేపట్టామని అన్నారు. 2004-14 వరకు 25 లక్షలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్‌ది అని మంత్రి పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యం అని చెప్పారు.