గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ను నిర్మిస్తే.. బెగరికంచను నాలుగో సిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించనుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని హెల్త్, స్పోర్ట్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామన్నారు. మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. 57 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో వర్సిటీని నిర్మించనున్నట్లు తెలిపారు.