రాష్ట్రంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం: హోంమంత్రి అనిత

70చూసినవారు
రాష్ట్రంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయడమే తమ లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి నియంత్రణపై సచివాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి జిల్లాలో ‘ఈగల్’ పేరుతో నార్కోటిక్స్‌ కంట్రోల్ సెల్, నార్కోటిక్స్‌ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో గంజాయి పేరు వినబడకుండా పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్