రెవెన్యూ ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పదోన్నతులు వంటి వాటిని తక్షణమే పరిష్కరిస్తామన్నారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టిస్తామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఎన్నికలప్పుడు బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ స్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామన్నారు.