సంగారెడ్డి పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాలైన రెవిన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలలో మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. లోతట్టు ప్రాంతాలలో వరద నీటితో మునిగిన ఇళ్ళను మంత్రి పరిశీలించారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మంత్రి వెల్లడించారు.