వార ఫలాలు (15-05-2022 నుంచి 21-05-2022)

45853చూసినవారు
వార ఫలాలు (15-05-2022 నుంచి 21-05-2022)
మేషం వారం అంతటా వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉంటుంది. మంచి ఆలోచనలతో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలోనూ అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ ధైర్యాన్ని తగ్గించేలా కొందరు మాట్లాడుతుంటుంటారు. వారితో తక్కువగా మాట్లాడాలి. సొంత విషయాలు, రహస్యాలను మిగిలిన వారితో చర్చించవద్దు. అవసరాలకు ధనం సమకూరుతుంది. వారం మధ్యలో విజయం సాధించారు. ముంది. నిలకడలేనితనం వద్దు. వృషభం మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో మీకు గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరతాయి. మంచి ఆలోచనలతో చేపట్టే పనులు విజయవంతమవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త. మిథునం ముఖ్యమైన పనుల పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో సౌమ్యంగా మాట్లాడాలి. మీరు చేపట్టే పనులకు అడుగడుగునా ఆటంకాలుంటాయి. వాటిని నేర్పుతో అధిగమించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యుల సలహాతో తీసుకుంటే మేలుచేస్తుంది. కర్కాటకం శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగపరంగా అభివృద్ధీ ప్రశంసలూ ఉంటాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. దివ్యమైన ఆలోచనలు వస్తాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. సింహం ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. ఎవరినీ నమ్మవద్దు. స్వయంగా చేసే పనులు శక్తినిస్తాయి. ధన లాభముంది. సందేహించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కాలం వృథా చేయకుండా పనిచేస్తే విజయముంటుంది. సాహస కార్యాలు చేయవద్దు. కన్య గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. మీరు అనుకున్న విధంగానే ముందుకుసాగండి. అవరోధాలను సునాయాసంగా దాటగలరు. సంకల్పం బలంగా ఉండాలి. చెడు ఆలోచనలు రానివ్వవద్దు. ఈర్ష్యపడే వారుంటారు. తుల మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాలను వాయిదా వేయటం మంచిది. కాలం సహకరించటం లేదు. పొరపాటు జరిగితే సమస్య జటిలమవుతుంది. ఆత్మవిశ్వాసంతో విధులను నిర్వర్తించాలి. చంచలత్వం లేకుండా జాగ్రత్తపడాలి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు అధికమవుతాయి. వృశ్చికం కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టవంతులవుతారు. కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. శ్రద్ధ పెంచితే అధిక లాభాలు ఉంటాయి. ఇంట్లోవారి సలహాలు అమలు చేయండి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. విశ్రాంతి అవసరం. శుభవార్త వింటారు. ధనుస్సు అత్యంత శ్రేష్ఠమైన కాలం. తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. ఘనకీర్తిని పొందుతారు. ఉద్యోగ ఫలితాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు జీవితం లభిస్తుంది. వ్యాపారబలం ఉంది. ఆర్థికంగా కలిసొస్తుంది. సంపద పెరుగుతుంది. మకరం ఉద్యోగ ఫలితాలు మిశ్రమం. దేనికీ వెనుకాడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. దైవానుగ్రహం ఉంది. ధన ధాన్య లాభముంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సమస్య రానివ్వద్దు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధువులవల్ల మంచి జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కుంభం మంచి కాలం నడుస్తోంది. అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆర్థికంగా విశేష లాభాలుంటాయి. సంకల్పం నెరవేరుతుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. ఆనందించే అంశముంటుంది. మీనం ఉద్యోగ ఫలితం అద్భుతం. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. అవరోధాలు తొలగుతాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. వ్యాపారరీత్యా పట్టువిడుపులతో పని చేయండి. స్వల్ప సమస్యలున్నా అంతిమంగా కలిసి వస్తుంది. మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్