మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షోకు గెస్టుగా వచ్చిన ఆయన చిరంజీవి గురించి ఆసక్తికర విషయలు పంచుకున్నారు. 'చిరంజీవి అంటే నాకిష్టమని అందరికీ తెలుసు. కానీ, నా బాల్యంలోనే ఆయన వ్యక్తిత్వానికి నేను ఫ్యాన్ అయ్యాను. చిరంజీవి అనే మంచి వ్యక్తికి ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్ కు అభిమానిగా మారా. మేము ఆయన్ను చిక్కు బాబాయ్ అని పిలుస్తాం' అని వెల్లడించారు.