పార్కింగ్ విషయంలో ఘర్షణ.. కారు ధ్వంసం

61చూసినవారు
ఓ కారు పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి, అది కాస్తా తిట్టుకోవడం, కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే అక్కడి వ్యక్తుల్లో పలువురు కోపోద్రిక్తులై ఆ కారు అద్దాలను కర్రలు, క్రికెట్ బ్యాటుతో తీవ్రంగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కన ఉన్న కొంత మంది ఇందుకు సంబంధించిన వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 72లో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్