సీఎం రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి ఎక్కడకు చేరారు? అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. దీనిపై చర్చ పెట్టాలన్నారు. ‘‘రేవంత్రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే అక్కగా నేను అశీర్వదించాను. చాలా గొప్ప నాయకుడిగా ఎదుగుతావని, సీఎం అవుతావని చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన నన్ను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు. మేం ఏం మోసం చేశాం? ఏం ముంచాము?” అని నిలదీశారు.