ఏమైంది మీ ప్రజా పాలన?: హరీష్ రావు

30516చూసినవారు
ఏమైంది మీ ప్రజా పాలన?: హరీష్ రావు
ప్రజలను ముఖ్యమంత్రి కలువట్లేదని ఆనాడు కేసీఆర్ ను అన్నారు. ఇప్పుడు మీ పాలనలో ప్రజలను కలుస్తున్నారా? అని సీఎం రేవంత్ ను మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇదేనా మీ ఒక్కరోజు ప్రజాపాలన. ఏదో పీకేస్తాం. పొడిచేస్తాం అన్నట్లు కంచెలు బద్దలు కొట్టి.. ప్రజాపాలన అని ఒక్కరోజే ప్రజల్ని కలిసి.. ఇప్పుడు రోజు ఒక ఆఫీసర్ ను పెట్టి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి మీరు చెప్పిన ప్రకారం ప్రజలను రోజూ కలవండి.. ఏమైంది మీ ప్రజా పాలన? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్