ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

33480చూసినవారు
ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
బంగ్లాదేశ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. గబ్‌ఖాన్ బ్రిడ్జ్ ప్రాంతంలో కారు, ఆటో రిక్షా, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు ఝలకతి జిల్లా ఎస్పీ అఫ్రుజుల్ హక్ తుతుల్ వెల్లడించారు. ఫరీద్‌పూర్‌లో మంగళవారం జరిగిన మరో ఘోర ప్రమాదంలో 14 మంది చనిపోయారు. బంగ్లాదేశ్‌లో గత పది రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో కనీసం 100 మంది మరణించారు.

ట్యాగ్స్ :