టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీఓను విడుదల చేసింది. దీన్ని అనుసరించి హిందువులు కాని వ్యక్తులు/అన్యమతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి, సంతకం చేయాలి.