తీజ్ పండుగ అంటే ఏమిటి?

61చూసినవారు
తీజ్ పండుగ అంటే ఏమిటి?
తీజ్ పండుగ ప్రారంభానికి ముందు యువతులందరూ ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరిస్తారు. అంగడికి వెళ్లి గోధుమలు, శనగలు తెచ్చుకుంటారు. గోధుమలను నానబెట్టి మొలకెత్తించేందుకు బుట్టలను అల్లుతారు. ఆ బుట్టలన్నీ ఒకే చోట ఉంచేందుకు పందిరిని ఏర్పాటు చేస్తారు. నానబెట్టిన గోధుమలను మట్టికలిపిన బుట్లలో చల్లుతారు. గోధుమ మొలకలను తీజ్‌గా పిలుస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బుట్టల్లో నీళ్లుపోస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలతో గడుపుతారు.

సంబంధిత పోస్ట్