కోల్‌కతా టార్గెట్‌ ఎంతంటే

7274చూసినవారు
కోల్‌కతా టార్గెట్‌ ఎంతంటే
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ గెలవడానికి భారీ స్కోరు అవసరమైనే నేపథ్యంలో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెంటనే ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి భారీ షాట్‌లతో జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. అయితే వరుస వికెట్‌లు కోల్పోగానే జట్టు స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు చేసింది. దీంతో కోలక్‌తా విజయానికి 139 పరుగులు చేయాల్సి ఉంది. మంచి ఆటతీరును కనబరిచిన విరాట్‌ కోహ్లీ 22 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఇక కోహ్లీకి మద్దతుగా నిలిచిన దేవదత్ పడిక్కల్‌ కూడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే పడిక్కల్‌ అవుట్‌ అయిన తర్వాత ఏ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. బ్యాట్స్‌మెన్‌ వెంట వెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. ఇక కోల్‌కతా బౌలింగ్ విషయానికొస్తే అత్యధికంగా సునీల్‌ నరైన్‌ అందరికంటే ఎక్కువగా 4 వికెట్లను పడిగొట్టాడు. నాలుగు ఓవర్‌లలో కేవలం 21 పరుగులు ఇవ్వడం విశేషం. తర్వాత లాకీ ఫెర్గూసన్ నాలుగు ఓవర్‌లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మరి బెంగళూరు ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా చేదిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత పోస్ట్