ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం. సత్యనారాయణ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే వైసీపీ నేత విద్యాసాగర్‌పై జెత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.