అడిలైట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈనెల 6 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా దిగడని తెలుస్తోంది. మొదటి టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, రాహుల్ జోడి ఓపెనింగ్ చేస్తారని సమాచారం. అలాగే శుభమన్ గిల్ అందుబాటులో ఉండనుండడంతో అతడు మూడో స్థానంలో నాలుగో స్థానంలో కోహ్లీ ఐదో స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.