మల్లెసాగులో మొగ్గ తొలుచు పురుగు నివారణ

72చూసినవారు
మల్లెసాగులో మొగ్గ తొలుచు పురుగు నివారణ
మల్లె తోటలో చీడపీడలను సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే ఎక్కువ దిగుబడికి అవకాశం ఉంటుంది. మల్లెసాగులో మొగ్గ తొలుచు పురుగు లార్వా మొగ్గ లోపలికి వెళ్లి మొగ్గను తినేస్తుంది. ఉద్ధృతి దశలో మొగ్గలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ముడత పడేలా చేస్తుంది. పురుగు సోకిన మొగ్గలు నీలం రంగులోకి మారిపోతాయి. నివారణకు మలాథియాన్ 2 మి.లీ (లేదా) వేపనూనె 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్