వాట్సాప్ సైబర్ లింక్.. రూ.5.27 కోట్ల మోసం

59చూసినవారు
వాట్సాప్ సైబర్ లింక్.. రూ.5.27 కోట్ల మోసం
హైదరాబాద్‌‌లోని కొండాపూర్‌లో నివసించే ఓ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌కు ఫేస్‌బుక్‌లో ప్రముఖ సెక్యూరిటీస్‌ సంస్థ పేరిట ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్‌ చేయగా వాట్సాప్‌ గ్రూపు లింక్‌ వచ్చింది. అందులో చేరాక సంస్థ సీఐవో పేరిట ఓ వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ మాట్లాడారు. షేర్‌ మార్కెట్‌లో కొత్తగా లిస్ట్‌ కాబోతున్న కంపెనీల ఐపీవోల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఓ యాప్‌లో చేర్పించాడు. అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లోకి పలు విడతలుగా రూ.5.27 కోట్లు బదిలీ చేయించుకొని ముఖం చాటేశారు.

సంబంధిత పోస్ట్