తెలంగాణ డీఎస్సీ ఫలితాలను 3,4 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ పరీక్షలో మార్కులు, టెట్‌లో వచ్చిన మార్కుల వెయిటేజీని కలిపి డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందించనుంది. నిన్న డీఎస్సీ ‘కీ’ విడుదల కాగా.. ప్రిలిమినరీ కీతో పోలిస్తే ఫైనల్ కీలో 109 ప్రశ్నలకు జవాబులు మార్చినట్లు తెలుస్తోంది. 50 ప్రశ్నలకు ఆన్సర్స్ సరిగ్గా లేకపోవడంతో వాటికి మార్కులు జత చేశారు.