యుద్ధ విమానం గాల్లో ఉండగా.. జారిపడ్డ సామగ్రి..!

74చూసినవారు
యుద్ధ విమానం గాల్లో ఉండగా.. జారిపడ్డ సామగ్రి..!
భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం ఆకాశంలో ఉండగా ఒక అనుకోని పరిస్థితి ఎదురైంది. అందులో నుంచి సామగ్రి జారిపడిందని ఐఏఎఫ్ వెల్లడించింది. సాంకేతిక లోపమే ఇందుకు కారణమని తెలిపింది. బుధవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సామగ్రి జారిపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్