పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని, ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్నారు.