ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటుడు దీపక్ పెర్వానీ పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువుగా గుర్తింపు పొందారు. ఆయన 1974లో సింధీ హిందూ కుటుంబంలో జన్మించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 101 అడుగుల కుర్తాను రూపొందించిన దీపక్ పెర్వానీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా కలిగి ఉన్నారు. 2022 నాటికి ఆయన నికర విలువ దాదాపు రూ.71 కోట్లుగా ఉన్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.