రాజకీయ నేతలకు పోలీసు భద్రత ఎందుకు?

85చూసినవారు
రాజకీయ నేతలకు పోలీసు భద్రత ఎందుకు?
మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు పోలీసు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆలిండియా మక్కల్ మరుమలర్చి పార్టీ అధ్యక్షుడు పొన్ మురుగేశన్ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చేవారికి భద్రత ఎందుకని ప్రశ్నించింది. కావాలనుకుంటే మీ సొంత ఖర్చుతో భద్రత కల్పించుకోవాలని పిటిషన్ కొట్టేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్