AP: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో హెపటైటిస్ బీ, సీ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 2,197 మందికి పరీక్షలు చేయగా.. 205 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారికి అమలాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో గ్రామంలో అందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.