ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామాలయం శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఏప్రిల్ 6 శ్రీరామ నవమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 11వ తేదీ రాత్రి రాముల వారి కల్యాణోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.