మన దేశంలో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలవారే ఎక్కువ. నిత్యావసరాలు, ఆహార పదార్థాలను అధికంగా వినియోగించేదీ వారే. యుద్ధాలు, వాతావరణ మార్పుల ప్రభావం, కరవు పరిస్థితులు... ఇవన్నీ ఆహార కొరతకు, ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ధరల పోటీని తట్టుకొని నిలబడటంతో పాటు అధిక లాభార్జన, కృత్రిమ కొరతను సృష్టించేందుకు ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు.