భార్య ప్రియుడిని కత్తితో పొడిచి చంపాడు (వీడియో)

74చూసినవారు
మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. లఖు అనే వ్యక్తి భార్యతో రోహన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో రోహన్‌పై లఖు పగతో రగిలిపోయాడు. హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింధీ క్యాంపు ప్రాంతంలో ఈ నెల 22న రోహన్‌ను లఖు పట్టుకున్నాడు. స్నేహితుడి సాయంతో రోహన్‌ను కత్తితో పలుమార్లు క్రూరంగా పొడిచి చంపాడు. రోహన్ చనిపోయే వరకు లఖు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.