భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశోధకుడు, పాడ్ కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ తెలిపారు. ఆయన ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అప్పుడే మోదీతో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని, ఇప్పటివరకు భారత్‌ను ఎప్పుడూ సందర్శించలేదని, అక్కడి శక్తిమంతమైన, చరిత్రాత్మక సంస్కృతి, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించేందుకు ఎదురు చూస్తున్నట్లు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.